మైదుకూరు నియోజకవర్గంలో గ్రామ సమాఖ్య అసిస్టెంట్లకు సోమవారం ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ మొబైల్ ఫోన్లను పంపిణీ చేశారు. ఈ ఫోన్ల ద్వారా డ్వాక్రా ఆర్థిక లావాదేవీలను ఆన్‌లైన్‌లో సులభంగా నమోదు చేయవచ్చని, పథకాల సమాచారం ప్రజలకు వేగంగా చేరుతుందని, దీనివల్ల పారదర్శకత పెరిగి మహిళా సాధికారతకు మరింత బలం చేకూరుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వీఓఏలు భారీగా పాల్గొన్నారు.