జగన్మోహన్ రెడ్డి హత్యను నిరసిస్తూ మైదుకూరులో ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జర్నలిస్టులు బుధవారం నల్ల బ్యాడ్జీలతో ర్యాలీ చేపట్టారు. నిందితుడు తమీమ్‌కు కఠిన శిక్ష విధించాలని కోరుతూ సీఐ, తహసీల్దార్‌కు వినతిపత్రాలు అందజేశారు. ప్రజా సమస్యలపై పోరాడే విలేకరులకు రక్షణ కరువైందని, వారికి ప్రత్యేక చట్టం తీసుకురావాలని, బాధితుల కుటుంబాన్ని ఆదుకోవాలని జర్నలిస్టులు డిమాండ్ చేశారు.