బుధవారం మైదుకూరు నుండి కడప వెళ్లే రహదారిలో పెట్రోల్ బంక్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కూలి పనులు ముగించుకుని ఆటోలో ఇంటికి వెళ్తున్న కూలీలను కారు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో పది మంది కూలీలు గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను మైదుకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.