సోమిరెడ్డిపల్లిలో పాఠశాల భవన పనులు పూర్తి చేయాలి

2చూసినవారు
సోమిరెడ్డిపల్లిలో పాఠశాల భవన పనులు పూర్తి చేయాలి
బ్రహ్మంగారిమఠం మండలంలోని సోమిరెడ్డిపల్లి మండల ప్రాథమిక పాఠశాలలో మూడేళ్లుగా భవనాలు అసంపూర్తిగా ఉండటంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలు తెరిచే నాటికి నిధులు విడుదల చేసి పనులు పూర్తి చేయాలని వారు కోరుతున్నారు. విద్యార్థుల తాగునీటి అవస్థలను దృష్టిలో ఉంచుకుని చేతి పంపునకు మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ అధికారులు స్పందించి భవన పనులు పూర్తి చేసి, తాగునీటి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్