పోలీసుల ఒత్తిడి నివారణకు ప్రత్యేక శిబిరం

15చూసినవారు
పోలీసుల ఒత్తిడి నివారణకు ప్రత్యేక శిబిరం
మానసిక ఒత్తిడిని నియంత్రించే లక్ష్యంతో మైదుకూరు పోలీస్ అధికారులు, సిబ్బందికి 'హార్ట్ ఫుల్‌నెస్ మెడిటేషన్' శిక్షణ బుధవారం నుంచి మూడు రోజుల పాటు డీఎస్పీ ఆఫీసు మైదానంలో ప్రారంభమైంది. ట్రైనర్ సురేంద్రనాథ్ రెడ్డి కోప నియంత్రణ, సవాళ్లను ఎదుర్కోవడం, సమయపాలనపై అవగాహన కల్పించారు. డీఎస్పీ జి. రాజేంద్రప్రసాద్, అధికారులు, సిబ్బంది పాల్గొన్న ఈ శిక్షణ ఒత్తిడి తగ్గించి సమర్థవంతంగా పనిచేయడానికి దోహదపడుతుందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్