బురదలో మోకరిల్లిన విద్యార్థులు: మాకు దారి చూపించండి సార్!

24చూసినవారు
చాపాడు మండలం తిప్పిరెడ్డిపల్లెలో రోడ్డు పనులు నెలల తరబడి నిలిచిపోవడంతో గ్రామం బురదమయమైంది. అత్యవసరాలకు అంబులెన్స్ కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొంది. అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా మంగళవారం మహిళలు, విద్యార్థులు రోడ్డుపై బురదలో మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు. "మాకు దారి చూపించండి. మా ఓట్లే మీకు కావాలా?" అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ, వెంటనే రహదారి నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you