కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. మైదుకూరులో మంగళవారం జరిగిన వైసీపీ గ్రామ, వార్డు కమిటీల నియామక సదస్సులో ఆయన మాట్లాడుతూ, ఆరోగ్యశ్రీని నీరుగార్చి పేదలను కష్టాలపాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించక విద్యార్థులకు సర్టిఫికెట్లు అందడం లేదని, ఈ కమిటీలతో పార్టీ బలోపేతం అవుతుందని ఎంపీ స్పష్టం చేశారు.