మైదుకూరు మండలం వనిపెంట కుంటవల్లే నీరు పొంగిపారడంతో వనిపెంట, పప్పన్నపల్లె, ఆదిరెడ్డిపల్లి, ముసన్నయాపల్లె గ్రామాల్లోని 3,000 ఎకరాల పంట భూములు నీట మునిగాయి. విఫలమైన కాలువ నిర్మాణం వల్లే ఈ దుస్థితి నెలకొందని రైతు సేవాసమితి నేతలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు చేపట్టాలని, లేదంటే ఆందోళనలు తప్పవని వారు హెచ్చరించారు.