పీలేరు లో యువకునిపై అమానుష దాడి

14చూసినవారు
బుధవారం సాయంత్రం పీలేరు పట్టణం సైనిక్‌నగర్‌లో బాబు అనే వ్యక్తి, ఎర్రవారిపాలెం మండలం ఎల్లమందకు చెందిన రమేష్‌పై అమానుష దాడికి పాల్పడ్డాడు. సీవీ మహల్ సమీపంలో జరిగిన ఈ ఘటనలో, బాబు రమేష్‌ను రాళ్లతో కొట్టి, కాళ్లతో తన్నినట్లు స్థానికులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన రమేష్ ఆపస్మారక స్థితికి చేరుకోగా, స్థానికులు దాడిచేసిన వ్యక్తిని అడ్డుకున్నారు. గాయపడిన రమేష్‌ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దాడికి గల కారణాలు తెలియరాలేదు, పోలీసులు విచారణ చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్