పీలేరు పోలీస్ స్టేషన్లో వృద్ధుడి మృతి

16చూసినవారు
పీలేరు పోలీస్ స్టేషన్లో వృద్ధుడి మృతి
పీలేరు పట్టణంలో భూవివాదానికి సంబంధించిన ఫిర్యాదు చేయడానికి వచ్చిన చంద్రారెడ్డి (80) అనే వృద్ధుడు మంగళవారం పోలీస్ స్టేషన్‌లోనే కుప్పకూలి మృతి చెందారు. వేపులబైలు పంచాయతీ కూరపర్తివారి పల్లికి చెందిన ఆయన, భూ వివాదంపై ఫిర్యాదు చేయడానికి పీలేరు పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. స్టేషన్‌లోనే అకస్మాత్తుగా కుప్పకూలడంతో, వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, వైద్యులు ఆయన మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్