గుర్రంకొండ: బ్రహ్మోత్సవాల్లో అశ్లీల నృత్యాలు.. కేసు నమోదు

7చూసినవారు
గుర్రంకొండ: బ్రహ్మోత్సవాల్లో అశ్లీల నృత్యాలు.. కేసు నమోదు
తరిగొండ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా అశ్లీల నృత్యాలు చేయించిన వారిపై గుర్రంకొండ పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. పిల్లగోవులవారిపల్లెకు చెందిన చాందిని బండి వద్ద, డీజే శబ్దాలతో హిజ్రాలను అర్ధనగ్నంగా నృత్యం చేయిస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించినట్లు ఎస్సై రవీంద్ర తెలిపారు. కలకడ మండలం బొంతలవారిపల్లికి చెందిన వ్యక్తులు నిబంధనలు ఉల్లంఘించి అసభ్యకరంగా ప్రవర్తించారని, ఆధ్యాత్మిక ఉత్సవాల్లో ఇలాంటి అశ్లీలతకు తావులేదని ఆయన స్పష్టం చేశారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్