బుధవారం జరిగిన పార్టీ సమావేశంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి తోపు కృష్ణప్ప, కె. వి. పల్లి మండలం మఠంపల్లి పంచాయతీ కలికిరివాండ్లపల్లిలో నివసిస్తున్న యానాది కుటుంబాలకు వెంటనే ఇంటి స్థలాలు, పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. మూడేళ్లుగా పోరాడుతున్నా రెవెన్యూ అధికారులు స్పందించకపోవడం దారుణమని ఆయన అన్నారు. సర్వే నంబర్ 70లో అర్హులైన గిరిజనులకు 3 సెంట్ల స్థలం కేటాయించాలని, లేనిపక్షంలో సీపీఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.