గుర్రంకొండలో పిచ్చికుక్క వీరంగం.. పలువురికి గాయాలు

3చూసినవారు
గుర్రంకొండలో పిచ్చికుక్క వీరంగం.. పలువురికి గాయాలు
గుర్రంకొండ మండలంలోని గుండ్లగుట్ట తండాలో బుధవారం సాయంత్రం ఓ పిచ్చికుక్క బీభత్సం సృష్టించింది. కనిపించిన వారిపై దాడి చేసి జయమ్మ, హరిత, నాగిరెడ్డి సహా మరో నలుగురిని తీవ్రంగా గాయపరిచింది. బాధితులను మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గ్రామంలో పిచ్చికుక్క సంచారం కొనసాగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్