లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

0చూసినవారు
లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
శుక్రవారం, పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి కె. వి. పల్లి మండలం నారమాకులపల్లిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఇంటింటికీ వెళ్లి వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పెన్షన్లు అందజేసి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతి నెల 1వ తేదీన పెన్షన్లు ఇంటి వద్దకే అందిస్తున్నామని, పేదలకు అండగా నిలవడమే ప్రభుత్వ లక్ష్యమని, పంపిణీలో పారదర్శకత పాటించాలని అధికారులకు సూచించారు. గ్రామంలో 100% పెన్షన్ల పంపిణీ పూర్తిచేశామని తెలిపారు.
Job Suitcase

Jobs near you