పీలేరు: దళితుల ఆత్మగౌరవ నిరసన ర్యాలీకి పిలుపు
By Sudhakar Pokala 8చూసినవారుసుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బి. ఆర్. గవాయిపై జరిగిన దాడిని నిరసిస్తూ, నవంబర్ 1న హైదరాబాద్‌లో జరగనున్న దళితుల ఆత్మగౌరవ నిరసన ర్యాలీని విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ పీలేరు నియోజకవర్గ ఇన్‌చార్జి గండికోట వెంకటేష్ పిలుపునిచ్చారు. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు, పీలేరు పరిధిలోని ఆరు మండలాల్లో పర్యటించి అవగాహన కల్పించారు. దళితుల ర్యాలీకి విస్తృతంగా తరలిరావాలని పీలేరు నాయకులు కోరారు.