చింతపర్తి పీహెచ్‌సీ వైద్యురాలు డా. జులేఖబేగం మంగళవారం వాల్మీకి పురం మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ప్రజలను వడదెబ్బకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వేసవిలో వడ గాలుల ప్రభావం అధికంగా ఉంటుందని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఎక్కువగా నీరు తాగడం, ఎండలో బయటకు వెళ్లకపోవడం, తేలికపాటి దుస్తులు ధరించడం వంటి సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ హెచ్‌వో మహమ్మద్ రఫీ పాల్గొన్నారు.