మహల్ రాజుపల్లి వద్ద రోడ్డు ప్రమాదం… బాలిక మృతి

7చూసినవారు
మహల్ రాజుపల్లి వద్ద రోడ్డు ప్రమాదం… బాలిక మృతి
శనివారం కే. వీపల్లి మండలం మహల్ రాజుపల్లి సమీపంలోని పీలేరు–కడప జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో 17 ఏళ్ల శివరాణి అనే బాలిక మృతి చెందింది. తిరుపతి నుంచి స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న మల్లేశ్వర, అతని చెల్లెలు శివరాణిపై ఓ కారు ఓవర్‌టేక్ చేసే ప్రయత్నంలో ఢీకొంది. ఈ ప్రమాదంలో శివరాణికి కుడికాలు విరిగి తీవ్ర గాయాలయ్యాయి. 108 ద్వారా పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.

సంబంధిత పోస్ట్