వాయల్పాడు మండలం చింతపర్తి పీహెచ్సీ పరిధిలోని తాటిగుంటపల్లిలో 104 సేవలలో భాగంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్క్రబ్ టైఫస్ అంటువ్యాధి కాదని, ప్రజలు భయపడకుండా అవగాహనతో అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ తెలిపారు. ఈ వ్యాధి చిగ్గర్ అనే చిన్న పురుగు కాటు వల్ల వస్తుందని, జ్వరం, నల్ల మచ్చలు వంటి లక్షణాలు ఉంటాయని, రక్తపరీక్షల ద్వారా నిర్ధారణ చేసి మందులతో పూర్తిగా నయం అవుతుందని వివరించారు. అనంతరం కరపత్రాలు పంపిణీ చేసి ర్యాలీ నిర్వహించారు.