కలకడకు చెందిన 9వ తరగతి విద్యార్థిని రమీజా జైనాబ్ క్యాన్సర్‌తో చెన్నై ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ప్రభుత్వం మంజూరు చేసిన రెండు నెలల పింఛన్ రూ. 20,000 నగదును బిల్ కలెక్టర్ హరిప్రసాద్ సోమవారం ఆసుపత్రికి వెళ్లి నేరుగా అందజేశారు. ఆపద కాలంలో అండగా నిలిచిన ప్రభుత్వానికి బాలిక తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.