అన్నమయ్య జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలనకు పోలీస్ శాఖ సరికొత్త తనిఖీలు శనివారం ప్రారంభించింది. ఎస్పీ ధీరజ్ ఆదేశాలతో పీలేరు, పుంగనూరు పరిధిలో అధునాతన 'డ్రగ్ డిటెక్షన్' కిట్లతో ముమ్మరంగా పరీక్షలు చేశారు. మొత్తం 13 మంది అనుమానితులకు పరీక్షలు చేయగా నెగిటివ్ వచ్చింది. గంజాయి రాపిడ్ టెస్టులో పాజిటివ్ వస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. అక్రమ రవాణాపై సమాచారం ఉంటే డయల్ 112 లేదా 1972కు తెలపాలని కోరారు.