అన్నమయ్య జిల్లా మద్దయ్యగారిపల్లెలో గురువారం విషాదం చోటు చేసుకుంది. బుధవారం ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఇందులో షామీర్ బాషా (55) మృతిని జీర్ణించుకోలేక అతని తల్లి మైమున్(66) షుగర్ ఎక్కువై మృతి చెందింది. షామీర్ బాషా అంత్యక్రియలు ఇప్పటికే పూర్తి కాగా.. మైమున్ అంత్యక్రియలు జరుగుతున్నాయి. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.