
ప్రజలకు అందుబాటులో ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి: మున్సిపల్ ఆఫీసులో ప్రత్యేక ఛాంబర్ ఏర్పాటు
ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డికి స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఒక ఛాంబర్ ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 వరకు ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకుంటున్నారు. 80 ఏళ్ల వయసులోనూ ప్రజాసేవలో నిమగ్నమైన ఎమ్మెల్యే వరదపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. మున్సిపల్ ఆఫీసులో ఎమ్మెల్యే ఛాంబర్ ఏర్పాటు, ప్రజలకు ఆయన అందుబాటులో ఉండటం ప్రజాసమస్యల పరిష్కారానికి మార్గం సుగమం చేసిందని ప్రజలు చర్చించుకుంటున్నారు.





































