ప్రొద్దుటూరు ట్రాఫిక్ సీఐ ని సన్మానించిన ఏ ఎస్ పి

ప్రొద్దుటూరు ట్రాఫిక్ సీఐ రాజగోపాల్‌ను కడప రిమ్స్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. ఈ సందర్భంగా ప్రొద్దుటూరు ఏఎస్పీ విభుకృష్ణ తన కార్యాలయంలో సీఐ రాజగోపాల్‌ను మెమెంటోతో సన్మానించి, ప్రొద్దుటూరులో ట్రాఫిక్ నియంత్రణకు ఆయన చేసిన కృషిని అభినందించారు. ఆయన బదిలీపై వెళ్లేచోట మంచి పేరు తెచ్చుకోవాలని, ప్రజల మన్ననలు పొందాలని ఆకాంక్షించారు.
