ఎర్రగుంటపల్లెలో ఇరు వర్గాలపై కేసు నమోదు: ఎస్సై

7చూసినవారు
ఎర్రగుంటపల్లెలో ఇరు వర్గాలపై కేసు నమోదు: ఎస్సై
ప్రొద్దుటూరు మండలం ఎర్రగుంటపల్లెలో టీడీపీలోని రెండు వర్గాల మధ్య మంగళవారం రాత్రి జరిగిన ఘర్షణలో ఇద్దరు గాయపడ్డారు. వీరిని స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. శేఖర్, ఈశ్వర్ వర్గాలు పరస్పరం రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నాయి. బైక్ లైట్ వెలుతురు పడిందనే కారణంతో తాగి గొడవ పడినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బుధవారం ఆయన వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్