ప్రొద్దుటూరులో శనివారం సీఐటీయూ 56వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి సత్యనారాయణ మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ, కార్మికుల హక్కులను హరించివేస్తున్నాయని విమర్శించారు. కూలీలు, కార్మికుల హక్కులు, సమస్యలపై సీఐటీయూ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్, అంగన్వాడీ, ఆటో, చేనేత నాయకులు పాల్గొన్నారు.