పేదల ఆరోగ్యానికి భరోసా సీఎం సహాయనిధి: ఎమ్మెల్యే

7చూసినవారు
పేదల ఆరోగ్యానికి భరోసా సీఎం సహాయనిధి: ఎమ్మెల్యే
ప్రొద్దుటూరులో శుక్రవారం 53 మంది లబ్ధిదారులకు 54.81 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి పంపిణీ చేశారు. అర్హత ప్రామాణికంగా, కులమత, రాజకీయాలకు అతీతంగా పేదలందరినీ ఆదుకోవడమే సీఎం చంద్రబాబు లక్ష్యమని ఆయన తెలిపారు. ఈ చెక్కులు పేదల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్