మారీచుని మాటలు నమ్మొద్దు: కొండారెడ్డి

3చూసినవారు
టీడీపీ నేత ఉక్కు ప్రవీణ్ ను మారీచుడితో పోలుస్తూ, ఆయన మాటలు నమ్మవద్దని ఎమ్మెల్యే కుమారుడు కొండారెడ్డి ప్రజలకు సూచించారు. మంగళవారం ప్రొద్దుటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో, మాజీ ఎమ్మెల్యే రాచమల్లుపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము భూములు లాక్కోవడం, డబ్బులు వసూలు చేయడం వంటివి చేయకుండా నిజాయితీగా పాలన సాగిస్తున్నామని కొండారెడ్డి పేర్కొన్నారు.