రక్తపు మరక అంటకుండా ఎవరైనా అసెంబ్లీ గేటు తాకారా: రాచమల్లు

2చూసినవారు
మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి 1980ల నాటి రాజకీయాలపై ప్రశ్నలు లేవనెత్తారు. అప్పటి రాజకీయాల్లో రక్తపు మరకలు అంటకుండా ఎవరైనా అసెంబ్లీ గేటు తాకారా అని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుత ఎమ్మెల్యేలు, మంత్రులు జగన్, రాజారెడ్డిలను గొడ్డలి వేటు, వివేకానంద రెడ్డి హత్య వంటి సంఘటనలతో ఎగతాళి చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఆ కాలంలో పార్టీలతో సంబంధం లేకుండా అందరూ ఫ్యాక్షనిస్టులుగా ఉండేవారని ఆయన గుర్తు చేశారు. రాజారెడ్డి కాలంలో పులివెందులలో భయం ఉండేదని, జగన్ వచ్చాక స్వేచ్ఛ వచ్చిందని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్