ప్రొద్దుటూరులోని వైఎన్ఆర్ కాలనీకి చెందిన ఎస్ఎంఎస్ వ్యాధితో బాధపడుతున్న చిన్నారి వర్షిత్ తల్లిదండ్రులు, తమ కుమారుడిని నరాల బలహీనత వ్యాధి నుంచి రక్షించాలని మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు. రూ.16 కోట్ల విలువైన ఇంజెక్షన్ వేయించడానికి సహాయం చేయాలని కాశీ విశ్వనాధ్, బాల లింగమ్మ కోరారు. తమ బిడ్డ ప్రాణాలను కాపాడాలని వారు వేడుకున్నారు.