దువ్వూరులో భారీగా గుట్కా పట్టివేత

7చూసినవారు
దువ్వూరులో భారీగా గుట్కా పట్టివేత
బద్వేల్ నియోజకవర్గం దువ్వూరులో శుక్రవారం జిల్లా విజిలెన్స్ అధికారులు భారీగా గుట్కాను పట్టుకున్నారు. హైదరాబాదు నుంచి ప్రొద్దుటూరుకు లారీలో రవాణా అవుతున్న గుట్కాను అధికారులు అడ్డుకున్నారు. ఈ ఘటనలో 5 గుట్కా బండిళ్లను స్వాధీనం చేసుకుని, రూ. 1.50 లక్షల జరిమానా విధించారు. జీరోలో రవాణా అవుతున్న ఇతర వస్తువులకు మరో రూ. 1.65 లక్షల పన్ను విధించినట్లు అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్