మైలవరం డ్యాంలోని ప్రొద్దుటూరు తాగునీటి సరఫరా పథకాలను ఆదివారం మైలవరం మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి, విద్యుత్ శాఖ ఈఈ రమణా రెడ్డి పరిశీలించారు. మైలవరంలో విద్యుత్ నిలిచిపోయినప్పుడు ప్రొద్దుటూరుకు తాగునీటి సరఫరా ఆగిపోవడంపై వారు సమీక్షించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై చర్చించి, 24 గంటలు విద్యుత్ సరఫరా ఉండేలా సబ్ స్టేషన్ నుంచి ప్రత్యేక ఫీడర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.