ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి పదో తరగతి పూర్తి చేసిన బాలికపై అత్యాచారానికి పాల్పడిన యువకుడిపై పోక్సో కేసు నమోదైంది. దువ్వూరు మండలానికి చెందిన బాలికను వల్లూరు మండలం కోట్లూరుకు చెందిన ఈశ్వర్ అనే యువకుడు సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయమై, ప్రేమిస్తున్నానంటూ మాయ మాటలు చెప్పి తనని చూడాలని ఉందని సోమవారం ఆమె నివాసానికి వచ్చి తీసుకెళ్లి ఖాజీపేటలోని లాడ్జిలో అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఇంటి వద్ద వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. బాలికకు తీవ్ర రక్తస్రావం కావడంతో భయపడి తల్లికి చెప్పడంతో ఆసుపత్రికి తీసుకెళ్లింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.