ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని ఆలయాల ఈఓలతో గురువారం మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఆలయాల వారీగా ఆస్తులు, ఆదాయాల వివరాలను ఆయన సమీక్షించారు. ఆలయ భూములను వేలం ద్వారా రైతులకు కౌలుకు ఇవ్వాలని, భూముల ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమీక్షలో ఎండోమెంట్ ఏసీ శంకర బాలాజీ, ఈఓలు రమణ, శ్రీధర్, జగన్, కిరణ్ పాల్గొన్నారు.