గతంలో మున్సిపాలిటీ నిధులతో నిర్మించిన సిమెంట్ రోడ్డును గురువారం మున్సిపల్ అధికారులు బ్యారికేడ్లు పెట్టి బ్లాక్ చేశారు. స్థానిక మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి మాట్లాడుతూ, హైకోర్టు ఉత్తర్వుల మేరకు స్థానిక వివేకానంద కాలేజీలోకి నిర్మించిన రోడ్డును బ్లాక్ చేసినట్లు తెలిపారు. అప్పటి మున్సిపల్ కమిషనర్ రాధ హయాంలో ప్రైవేట్ స్థలంలో రోడ్డు నిర్మించగా, యజమానులు కోర్టుకెళ్లారు.