ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతీలో బుధవారం స్వచ్ఛపధం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. పంచాయతీల్లో పారిశుద్ధ్యంపై శ్రద్ధ పెట్టాలని, వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జమ్మలమడుగు డిఎల్ డిఓ రామాంజినేయులు, నూర్జహాన్, ఎంపీడీఓ సూర్యనారాయణ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి నరసింహులు కూడా పాల్గొన్నారు.