ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ రవిచంద్ర రెడ్డి టీడీపీ నేతలా వ్యవహరిస్తున్నారని, ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి, ఆయన కుమారుడు కొండారెడ్డి చెప్పినట్లుగా నడుచుకుంటున్నారని మున్సిపల్ వైస్ ఛైర్మన్లు బంగారెడ్డి, ఖాజా సోమవారం ఆరోపించారు. మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కౌన్సిల్ సమావేశాలు సవ్యంగా జరగనీయడం లేదని వారు మండిపడ్డారు.