ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గురువారం సాయంత్రం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, ఎడతెరిపిలేని వర్షాలు, గిట్టుబాటు ధరలు లేకపోవడం, అప్పుల భారంతో రైతులు సర్వస్వం కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి రైతులకు అన్ని విధాలుగా సహాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు.