ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో సోమవారం కొత్తగా మంజూరైన పెన్షన్లను ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన ఈ పెన్షన్లను అందజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సామాజిక పెన్షన్లపై ప్రత్యేక దృష్టి సారించారని, అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్లు అందిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు.