ప్రొద్దుటూరు పట్టణంలోని ఎస్సీ హాస్టల్లో 10వ తరగతి చదువుతున్న తలారి నరసింహులు (15) అనే విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మైలవరం మండలం కల్లుట్ల గ్రామానికి చెందిన నరసింహులు మోడంపల్లె హాస్టల్లో ఉంటున్నాడు. రాత్రి హాస్టల్ ఆవరణలోని చెట్టుకు ఉరి వేసుకుని కనిపించినట్లు తెలుస్తోంది. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. 2టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.