ప్రొద్దుటూరు: మహిళ ఆత్మహత్యాయత్నం

81చూసినవారు
ప్రొద్దుటూరు: మహిళ ఆత్మహత్యాయత్నం
ప్రొద్దుటూరు మిట్టమడి వీధికి చెందిన ప్రమీల అనే మహిళ కుటుంబ కలహాల కారణంగా మనస్తాపానికి గురై సోమవారం విషం తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా, వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆమె భర్త మల్లికార్జునపై కొంతమంది దాడి చేసిన నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్