ప్రొద్దుటూరు: కళలను భావితరాలకు అందించాలి

6చూసినవారు
ప్రొద్దుటూరులో శ్రీనటరాజ కళాక్షేత్రం ఆధ్వర్యంలో రాయలసీమ సంగీత, నృత్యోత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల్లో రాయలసీమ జిల్లాల నుంచి 250 మందికి పైగా నృత్యకారులు కూచిపూడి, భరతనాట్యం, జానపద నృత్యం, సంగీతం, బృంద నాట్యం ప్రదర్శిస్తున్నారు. ఈ ఉత్సవాలను శని, ఆదివారాల్లో నిర్వహిస్తున్నట్లు నటరాజ కళాక్షేత్రం నాట్యగురువు మోహిద్దీన్ ఖాన్ తెలిపారు. సంగీత, నృత్య కళలను భావితరాలకు అందించాలని డి.ఎస్.పి ఈ సందర్భంగా తన అభిప్రాయాన్ని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్