కార్తీక మాసం సందర్భంగా ప్రొద్దుటూరు నుంచి పంచారామాలకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడుపుతున్నట్లు బుధవారం డిపో మేనేజర్ మల్లికార్జున రెడ్డి తెలిపారు. రూ. 2,700కే ఐదు పంచారామాలను సందర్శించే అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అలాగే దీపావళి పండుగ సందర్భంగా బెంగళూరు నుంచి ప్రొద్దుటూరుకు ప్రత్యేక బస్సు సర్వీసులు కూడా నడుపుతున్నట్లు డీఎం తెలిపారు.