ప్రొద్దుటూరు మున్సిపల్ కూరగాయల మార్కెట్ వద్ద శనివారం ఉదయం మున్సిపల్ అధికారులు ఆక్రమణలను తొలగించారు. మున్సిపాలిటీ స్థలంలో కట్టడాలు నిర్మించి, వాటిని అద్దెకు ఇస్తున్నారని ఫిర్యాదులు అందాయి. మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ అధికారులు ఈ చర్యలు చేపట్టారు. ఉద్రిక్తతలు తలెత్తకుండా తెల్లవారుజామునే ఆక్రమణలను తొలగించారు.