ప్రొద్దుటూరులో బయటపడిన శ్రీ కృష్ణదేవరాయ శిలాశాసనం

3చూసినవారు
ప్రొద్దుటూరులో బయటపడిన శ్రీ కృష్ణదేవరాయ శిలాశాసనం
ప్రొద్దుటూరులోని సినీ హబ్ వద్ద ఇంటి నిర్మాణం కోసం జేసీబీతో తవ్వకాలు జరుపుతుండగా క్రీస్తు శకం 1523 నాటి శ్రీకృష్ణదేవరాయ శిలాశాసనం బయటపడింది. భారత పురావస్తు పరిశోధన డైరెక్టర్ మునిరత్నం రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, శ్రీకృష్ణదేవరాయలు తిరుమల దేవి పుణ్యం కోసం కావులూరులో చెన్నకేశవ స్వామి విగ్రహ ప్రతిష్ఠ చేసినట్లు ఈ శాసనం తెలియజేస్తుంది. క్రీస్తు శకం 1523 జనవరి 24 శనివారం ఈ శాసనం వేయించబడింది.