గత ప్రభుత్వంలో ప్రొద్దుటూరులోని కొంతమంది మీడియా విలేకర్లను వైసీపీ నేతలు వేధించారని టీడీపీ నేత, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ మురళీధర్ రెడ్డి ఆరోపించారు. ఆదివారం స్థానిక కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, గత చరిత్ర మరిచిపోయిన మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ఇప్పుడు మీడియాపై ప్రేమ నటిస్తే ఎవరూ నమ్మరన్నారు. గత ప్రభుత్వంలో రూ. 150 కోట్ల భూమిని కొట్టేయాలని ఆన్లైన్ నుంచి రాచమల్లు తీయించాడని ఆయన ఆరోపించారు.