ప్రొద్దుటూరులో టీడీపీ నేతలు కుతుబుద్దీన్, మురళి, పుల్లయ్య ఆదివారం తమ పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు పని వరదరాజుల రెడ్డి కుటుంబంపై బురద జల్లడమేనని విమర్శించారు. నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే కృషి చేస్తున్నారని, దీనిని ఓర్వలేకే రూ. 150 కోట్ల భూమికి వరద స్కెచ్ వేశారని రాచమల్లు ఆరోపిస్తున్నారని, ఆధారాలుంటే చూపాలని వారు డిమాండ్ చేశారు.