మైలవరం మండలం ఉప్పలపాడు గ్రామ శివారులో లావణ్య (30) అనే బీటెక్ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఉద్యోగం రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతురాలు మైలవరం మండలం దొమ్మర నంద్యాలకు చెందినది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.