Mar 11, 2026, 13:03 IST/ములుగు
ములుగు
రేపు ములుగులో ప్రజాప్రతినిధులకు శిక్షణహాజరుకానున్న మంత్రి
Mar 11, 2026, 13:03 IST
ములుగు జిల్లాలో ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికపై సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లకు ఈనెల 12న ఒకరోజు శిక్షణ ఇవ్వనున్నట్లు కలెక్టర్ దివాకర టీఎస్ తెలిపారు. ఇంచర్లలోని ఎంఆర్ ఫంక్షన్ హాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొని దిశానిర్దేశం చేయనున్నారు. గ్రామ, వార్డు స్థాయి అభివృద్ధి లక్ష్యాలపై ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించడమే ఈ శిక్షణ ముఖ్య ఉద్దేశ్యం.