శుక్రవారం, వేంపల్లెలో అక్రమ గ్రావెల్ తవ్వకాలు, రవాణాపై
టీడీపీ నేతలు ఎస్పీ జయచంద్రారెడ్డి, ఎస్ఐ తిరుపాల్ నాయక్ లకు వినతిపత్రం అందజేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా కొందరు వ్యక్తులు గ్రావెల్ తవ్వకాలు చేస్తున్నారని, పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు. వెంటనే చర్యలు తీసుకోవాలని వారు కోరారు.