పులివెందులలో అంగన్వాడీ కార్యకర్తల నిరసన

427చూసినవారు
పులివెందుల పట్టణంలోని స్థానిక మినీ సెక్రెటరీయేట్ కార్యాలయ ఆవరణంలో మంగళవారం అంగన్వాడీ కార్యకర్తలు నిరసన తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని, అంగన్వాడీలకు కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని, అంగన్వాడీ సెంటర్లకు వేసవి సెలవులు ప్రకటించాలని, తదితర డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని వారు కోరారు. అనంతరం వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

సంబంధిత పోస్ట్